చిన్నా చిన్న జీవపుబండి
చేతితో చేయని బండి
చాలా దూరం పోతుంది
ఎంతో అద్భుత బండి అది
1. ఇంజన్ గుర్రం లేనిది
రెండు కాళ్ళతో పోతుంది
చాలా దూరం పోతుంది
ఎంతో అద్భుత బండి అది
2. మోక్షం నరకం అనెడి
రెండే స్టేషన్లు కలవు
బైబిల్ చూపుచున్నది
మోక్షం వెళ్ళె మార్గమును
3. ఒక్కే ఒక్క టికెట్టు
క్రీస్తునందు విశ్వాసం
వాని పుణ్యం లేనిది
యేసు యొక్క కృపయే
4. యేసయ్య బండిని నడపనిచో
బండి క్రిందికి పడుతుంది.
మరణపు గంట మ్రోగగనే
బండి నిలచిపోతుంది
5. వీణ జండా కిరీటం
మోక్షమందు దొరుకును
ప్రభుక్రీస్తుకే జయము
స్తుతియించుట మన విధి