చిన్నవాడను యేసయ్యా
నన్ను ఆశీర్వదించుమయా
నీ శక్తితో నడుపుమయా
నన్ను ఎన్నడు విడువకయా
1. బలహీనుడను యేసయ్యా
నిలకడలేని వాడనయా
దావీదు వలెనే
గొప్పపనులు చేయ
బలముతో నింపుమయా ॥చిన్న॥
2. బుద్ధిహీనుడనూ యేసయ్యా
ఒట్టి పశువును నేనయ్యా
సొలొమోనువలెనే గొప్ప
పనులు చేయ జ్ఞానముతో
నింపుమయా ॥చిన్న॥