చిన్నలం మేము పిల్లలం
యేసుకు మేము ప్రతినిధులం
యేసుతో కలిసి లోకమును
మార్చేస్తాం మార్చేస్తాం మార్చేస్తాం
దేవుని కొరకై పని చేస్తాం.
దేవుని రాజ్యం స్థాపిస్తాం
చిన్న చిన్న పిల్లలం మేము
1. ఇశ్రాయేలు చిన్నది నడిపించెను
నయమానును దేవుని ఇంటికి
మార్చింది సైన్యాధిపతి బ్రతుకును
మ్రోగింది సువార్త సిరియాలోను
2. జోనాక్స్ మార్చెను స్కాంట్లాండ్ను
జాన్ వెస్లీ మార్చెను ఇంగ్లాండ్డు
లివింగ్స్టన్ మార్చెను ఆఫ్రికాను
నీవు నేను మార్చాలి మన ఊరును
నీవు నేను మార్చాలి భారతదేశాన్ని