newjerusalemministries.com

గడిచిన కాలమంతా – నను నడిపిన నా దేవా
నీ కంటి పాప లాగా – కాపాడిన నా ప్రభువా (2)
మరో యేడు నాకొసగినందుకు – నీకేమి నే చెల్లింతును
నీ ప్రేమను పంచినందుకు – నిన్నేమని కీర్తింతును (2)        ||గడిచిన||

ఇచ్చిన వాగ్ధానం మరువక – నిలుపు దేవుడవు
శూన్యమందైనా సకలం – సాధ్యపరచెదవు (2)
నా మేలు కోరి నీ ప్రేమతో – నను దండించితివి
చెలరేగుతున్న డంభమును – నిర్మూలపరచితివి (2)        ||మరో యేడు||

నాదు కష్ట కాలములోన – కంట నీరు రాకుండా
నాదు ఇరుకు దారుల్లోన – నేను అలసిపోకుండా (2)
నా సిలువ భారం తగ్గించి – నీవేగా మోసితివి
నీ ప్రేమతో పోషించి – సత్తువ నింపితివి (2)        ||మరో యేడు||

Gadichina Kaalamanthaa – Nanu Nadipina Naa Devaa
Nee Kanti Paapa Laagaa – Kaapaadina Naa Prabhuvaa (2)
Maro Yedu Naakosaginanduku – Neekemi Ne Chellinthunu
Nee Premanu Panchinanduku – Ninnemani Keerthinthunu (2) ||Gadichina||

Ichchina Vaagdhaanam Maruvaka – Nilupu Devudavu
Shoonyamandainaa Sakalam – Saadhyaparachedavu (2)
Naa Melu Kori Nee Prematho – Nanu Dandinchithivi
Chelareguthunna Dambhamunu – Nirmoolaparachithivi (2)       ||Maro Yedu||

Naadu Kashta Kaalamulona – Kanta Neeru Raakundaa
Naadu Iruku Daarullona – Nenu Alasipokundaa (2)
Naa Siluva Bhaaram Thagginchi – Neevega Mosithivi
Nee Prematho Poshinchi – Satthuva Nimpithivi (2)       ||Maro Yedu||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *