క్రీస్తుయేసుయొక్క మంచి సైనికుడు… 2 తిమోతి 2:3
1. క్రీస్తుని వీరులం-సాతానున్ జయింతుమ్-గీతముల్ పాడెదము (2)
లోకము ధ్వనింప సువార్త చాటించి (2) పాడెదము (1)
పల్లవి : రక్షకుడు యేసు, నా మిత్రుడు యేసు
నా కాపరి యేసు, నా యుద్ధ నాయకుడు
2. ఆత్మ ఖడ్గమును ధరించి మేము – ఆయత్తమయ్యెదము (2)
శోధనలెన్నైన శోకము ఎంతైన (2) వీరులము (1) ॥రక్షకుడు॥
3.పోరాటం పోరాడి పరుగు తుదముట్టించి – కృపను పొందెదము (2)
మహానందముతో కిరీటమున్ పొంది (2) వెళ్లెదము (1) ॥రక్షకుడు॥