newjerusalemministries.com

కొంత యెడము నీవైనా నే సాగలేను
నిమిషమైన నిన్ను విడిచి నే బ్రతుకలేను
కొంత యెడము నీవైనా

మరచిన వేళలో మది నీ పలుకులు
సడలి కట్టడలు మలినము తలపులు (2)
ప్రేమను పంచే ప్రేమ రూపుడా (2)
మరియొక్క మారు మన్నించు విభుడా (2)         ||కొంత యెడము||

కనులకు మోహము కమ్మిన క్షణము
వినుట మరచె నీ స్వరమును హృదయము (2)
కమ్మిన పొరలు కరిగించుటకు (2)
నడుపు నీ వైపుకు హృది వెలుగుటకు (2)         ||కొంత యెడము||

మదము, మత్సరములు సోకిన తరుణము
పాశము, ప్రేమకు విగతము ప్రాప్తము (2)
నిరతము స్థిరముగ నున్న అక్షయుడా (2)
నిలుపుము నీ కృపలో నన్ను రక్షకుడా (2)         ||కొంత యెడము||

మనుజ రూపమున మహిలో నిలిచి
మనిషి-కసాధ్యమౌ మరణము గెలిచి (2)
నను వరియించగ రానున్న ప్రియుడా (2)
నిన్నెదురుకొనగ మతి నియ్యు వరుడా (2)         ||కొంత యెడము||

Kontha Yedamu Neevainaa Ne Saagalenu
Nimishamaina Ninnu Vidichi Ne Brathukalenu
Kontha Yedamu Neevainaa

Marachina Velalo Madi Nee Paluku
Sadali Kattadalu Malinamu Thalapulu (2)
Premanu Panche Prema Roopudaa (2)
Mari Yokka Maaru Manninchu Vibhudaa (2)        ||Kontha Yedamu||

Kanulaku Mohamu Kammina Kshanamu
Vinuta Marache Nee Searamunu Hrudayamu (2)
Kammina Poralu Kariginchutaku (2)
Nadupu Nee Vaipuku Hrudi Velugutaku (2)        ||Kontha Yedamu||

Madamu Mathsaramulu Sokina Tharunamu
Paashamu Premaku Vigathamu Praapthamu (2)
Nirathamu Sthiramuga Nunna Akshayudaa (2)
Nilupumu Nee Krupalo Nannu Raksakudaa (2)        ||Kontha Yedamu||

Manuja Roopamuna Mahilo Nilichi
Manishi-kasaadhyamou Maranamu Gelichi (2)
Nanu Variyinchaga Raanunna Priyudaa (2)
Ninnedurukonaga Mathi Niyyu Varudaa (2)        ||Kontha Yedamu||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *