newjerusalemministries.com

1. కూ అనే కూసే కోకిల

కమ్మని గానం ఎవరిచ్చారే

ఆ యేసుడే ఆ యేసుడే

ఆ యేసుడే నాకిచ్చెను

2. మిల మిల మెరిసే తారాలారా

చక్కని కాంతిని ఎవరిచ్చారే

ఆ యేసుడే ఆ యేసుడే

ఆ యేసుడే మాకిచ్చెను

3. చక చక ఈదే చేపలారా

ఈదుట మీకు ఎవరు నేర్పిరి

ఆ యేసుడే ఆ యేసుడే

ఆ యేసుడే మాకు నేర్పెను

4.గల గల పారే సెలయేరు

పరుగు తీయుట ఎవరు నేర్పిరి?

ఆ యేసుడే ఆ యేసుడే

ఆ యేసుడే నాకు నేర్పెను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *