1. ఓ చిన్ని పుష్పమా
నీ సంతోషమునకు
కారణమేమొ చెప్పుమా
నన్ను చేసినవాడు
అందం ఇచ్చినవాడు
నాకు ఏమి కావాలో
ఆయనే చూసుకుంటాడు
రేపటిని గూర్చి
నాకు దిగులు లేదుగా
సృష్టికర్తను స్తుతించుటయే
నా పనిగా
2. ఓ లేత హృదయమా
నీవు విచారపడుట
తగదని తెలిసికొనుమా
నిన్ను చేసినవాడు
ఎన్నడూ మరువడు
మాట తప్పనివాడు
నీ చేయి విడువడు
పువ్వులను చూసి
నేర్చుకొనుమా
చింత యేసుపై వేసి
సంతోషించుమా