జీవమునకు పోవు ద్వారము ఇరుకు… మత్తయి 7:14
పల్లవి : ఏ మార్గములో నీవు వెళ్ళుచున్నావు(1)
ఏ గమ్యం చేరుటకై వెళ్ళుతున్నావు1)
ఎంచి చూడు ఏ మాత్రం ఆలసించక (2)
1.ఇరుకు మార్గము ఎంతో సంకుచితము
ఏ ఇద్దరు కూడి నడువలేనిది
ఒంటరిగా సిలువ మోసి వెంబడించిన
పొందెదవు అంతమున నిత్య జీవము ॥ఏ మార్గములో॥
2. విశాల మార్గము బహు వెడల్పయినది
ఆశించినవన్ని చేయ వీలున్నది
దైవభక్తి పాపభీతి లేని మార్గము
తుదకు నీకు దొరుకును నిత్య నరకము ॥ఏ మార్గములో॥
3. మార్గమైన క్రీస్తే ఇరుకు మార్గము
ఎడతెగక నీకు తోడై యుండును
నీ భారము లన్నింటిని భరియించును
నీకిచ్చు నిత్యమైన ఆనందము ॥ఏ మార్గములో॥