newjerusalemministries.com

పాట రచయిత: రేచెల్ జ్యోతి కొమానపల్లి

అమూల్యమైన ఆణిముత్యమా
యెహోవ దేవుని హస్తకృతమా 
అపురూప సౌందర్య రాశివి నీవు
ఆత్మీయ సుగుణశీలివి నీవు                      ||అమూల్యమైన||

జ్ఞానము కలిగి నోరు తెరచుదువు
కృపగల ఉపదేశమును చేయుదువు 
ఇంటివారిని బాగుగ నడుపుచూ
వారి మన్ననలను పొందుచుందువు         ||అమూల్యమైన||

చేతులతో బలముగా పనిచేయుదువు
బలమును ఘనతను ధరించుకొందువు 
రాత్రివేళ నీ దీపము ఆరదు
కాంతికిరణమై మాదిరి చూపుదువు         ||అమూల్యమైన||

దీనులకు నీ చేతులు పంచును
దరిద్రులను నీవు ఆదుకొందువు 
దూరము నుండి ఆహారము కొనుచు
మంచి భోజనముతో తృప్తిపరచుదువు         ||అమూల్యమైన||

Lyricist: Rachel Jyothi Komanapalli

Amoolyamaina Aanimuthyamaa
Yehova Devuni Hasthakruthamaa (2)
Apuroopa Soundarya Raashivi Neevu
Aathmeeya Sugunasheelivi Neevu (2)         ||Amoolyamaina||

Gnaanamu Kaligi Noru Therachuduvu
Krupagala Upadeshamunu Cheyuduvu (2)
Intivaarini Baaguga Nadupuchu
Vaari Mannanalanu Ponduchunduvu (2)         ||Amoolyamaina||

Chethulatho Balamugaa Panicheyuduvu
Balamunu Ghanathanu Dharinchukonduvu (2)
Raathrivela Nee Deepamu Aaradhu
Kaanthikiranamai Maadhiri Choopuduvu (2)         ||Amoolyamaina||

Deenulaku Nee Chethulu Panchunu
Daridrulanu Neevu Aadhukonduvu (2)
Dooramu Nundi Aahaaramu Konuchu
Manchi Bhojanamutho Thrupthiparachuduvu (2)         ||Amoolyamaina||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *